Breaking News

Loading..

అమరజీవి కామ్రేడ్ భీష్మారావు 40వ వర్ధంతి పుస్తకావిష్కరణ సభ..

  •  పోరు వీరుని చరిత్రకు అక్షర రూపం......!
  • సాహసోపేతంగా జీవించిన వారే వీరోచిత మరణం పొందుతారు.
  • సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం.
  • హత్య రాజకీయాలతో ప్రజా పోరాటాలని ఆపలేరు.
  • సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ..
  • కమ్యూనిస్టులపై నేటికీ కొనసాగుతున్న దాడులు నిర్బంధాలు.
  • రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు.

బిసిఎం10 న్యూస్ నవంబర్ 5 భద్రాచలం

ఆదివాసి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బూడిద భూస్వామి పెట్టుబడి దారి దోపిడీ నుండి బలహీన వర్గ ప్రజలను రక్షించేందుకు ఉద్యమ పాఠాలు నేర్పించి పోరాటాల బాటలో నడిపించి భద్రాచలం ఏజెన్సీలో విప్లవ పునాదులను నిర్మించిన బత్తుల భీష్మారావు పోరాట చరిత్రను ఆయన సతీమణి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు హైమావతి అక్షర రూపాన్ని ఇవ్వటం అభినందనీయమని సాహసోపేతంగా జీవించిన వారే వీరోచిత మరణం పొందుతారు అనటానికి బండారు చందర్రావు భీష్మారావ్ శ్యామల వెంకట్ రెడ్డి వంటి నాయకులే ప్రత్యక్ష నిదర్శనం అని సిపిఐ ఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. భీష్మ రావు 40వ వర్ధంతి సభ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ 1985 నవంబర్ 5న విప్లవం కోసం పనిచేసే భీష్మ రావు చందర్రావుని అత్యంత కిరాతకంగా హత్య చేసి విప్లవానికి పుట్టిన వికృత శిశువులు అని పీపుల్స్ వారు మరోసారి రుజువు చేశారని తమ్మినేని తీవ్రంగా విమర్శించారు. నాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టు నాయకులపై నిర్బంధాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఇన్ని నిర్బంధాలు ఎదురైనా ఎంతమంది నాయకులను హతమార్చిన ఈ దేశానికి ప్రత్యాయం కమ్యూనిస్టులేనని అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న మతోన్మాదానికి కమ్యూనిజం పరిష్కారం అని అని తమ్మినేని స్పష్టం చేశారు. అధికారం కోసం బిజెపి ఎంతకైనా దిగజారుతుంది అనటానికి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం నుండి చివరికి ఓటర్లను మాయం చేస్తే స్థితికి దిగజారారని బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో 64 లక్షల ఓట్లను చోరీ చేశారంటే బిజెపి రాజకీయ దిగజారుతనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. అధికారం కోసం కావలసిన అడ్డదారులన్నీ తొక్కే బిజెపిని నివారించేందుకే ఇండియా బ్లాక్ ని ఏర్పాటు చేశామని అన్నారు. అమరవీరుల పోరాట చరిత్రను అధ్యయనం చేస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ పార్టీని అభివృద్ధి చేయడమే మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని తమ్మినేని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

హత్యా రాజకీయాలతో ప్రజా పోరాటాలను ఆపలేరు..సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ


 80 దశకంలోనే అంటరానితనంపై భీష్మ రావు చందర్రావు వంటి కమ్యూనిస్టు నాయకులు ఉద్యమాలను నిర్మించాలని ఓపక్క బూర్జవ భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే గ్రామాలలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమ నిర్మించారని అటువంటి విప్లవ వీరులను అంతమొందించి విప్లవాని అణిచివేయాలనుకోవడం పగటి కలలేనని ఒక వీరుడు మరణిస్తే వందల మంది విప్లవకారులు పుట్టుకొస్తారని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. భీష్మ రావు వంటి విప్లవ నాయకుల చరిత్రలు ఈ నేటి తరం యువతకు తెలుసుకునేందుకు పుస్తక రూపంలో వారి చరిత్రను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. భీష్మ రావు మరణించి 40 సంవత్సరాలు గడిచిన నేటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని దానికి ఒకే ఒక కారణం ఆయన చేసిన బడుగు బలహీన వర్గ పోరాటాలేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులను విస్తరించకుండా నివారించేందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు ఇచ్చిందని అన్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మత రంగులు పూసి కుల మతాల మధ్య విభేదాలు సృష్టించి అధికారం నిలుపుకోవాలని బిజెపి చూస్తుందని అటువంటి బిజెపి ఎత్తుగడలకు కమ్యూనిస్టులే ప్రతినియమని ప్రజా పోరాటాల ద్వారానే బిజెపిని నివారించాలని కోరారు. కమ్యూనిస్టుల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే నాటినని నేటి వరకు ఇంకా దాడులు చేస్తూ అత్యా రాజకీయాలను కొనసాగిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఇటీవల ఖమ్మం జిల్లా రైతు సంఘం నాయకులు సామినేని రామారావును సైతం హత్య చేశారని అచ్చులతో దాడులతో కమ్యూనిస్టులు భయపడాలని వెస్లీ స్పష్టం చేశారు. అమరవీరుల స్ఫూర్తితో పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. 


నేటికీ కొనసాగుతున్న హత్యా రాజకీయాలు..పోతినేని సుదర్శన్ రావు.


 ప్రజా సమస్యలపై నిరంతరాయంగా పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులపై ఇటు మావోయిస్టులు మరోపక్క బూర్జవ రాజకీయ పార్టీ నాయకులు నేటికీ హత్య రాజకీయాలను కొనసాగిస్తున్నారని పోతినే సుదర్శన్ రావు ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం దూపుడికి గురవుతున్న దళిత గిరిజన ప్రజానీకం కోసం పోరాటాలు నిర్వహించిన చందర్రావు భీష్మ రావు వంటి నాయకులను కిరాతకంగా హత్య చేసి 40 సంవత్సరాలు గడిచిన నేటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో వారు చిరంజీవిగా నిలిచారని అన్నారు. నాయకులను ఎంతమంది ఇచ్చి విప్లవాన్ని అణిచివేయాలనుకోవడం అరచేతితో సూర్యకాంతిని ఆపటమేనని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో సామినేని రామారావుని హత్య కూడా ముమ్మాటికి రాజకీయ హత్య అని ఆ గ్రామంలో పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక బూర్జవ పార్టీ నాయకులు పథకం ప్రకారం హత్య చేశారని అన్నారు. ఎన్నికలలో ఓట్లు సీట్లు తగ్గితే తగ్గి ఉండొచ్చేమో గాని ఈ ప్రాంత ప్రజల గుండెల్లో కమ్యూనిస్టులు ఎప్పటికీ కొలువై ఉంటారని భవిష్యత్తులో ప్రజా పోరాటాల ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని పోతిని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం భీష్మరావు సతిమణి భక్తుల హైమావతి సీనియర్ నాయకులు పి సోమయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్న నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గ వీటి సరళ, అన్నవరపు కనకయ్య, ఏ. జె. రమేష్, శ్రీరామ్ నాయక్, బుర్రి ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి అధ్యక్షులు యలమంచి రవికుమార్,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ సత్యనారాయణ, మండలపు జ్యోతి బ్రహ్మచారి ఎం.బి. నర్సారెడ్డి, కారం పుల్లయ్య, బాలరాజు,శ్రీనివాస్, పిట్టల రవి,పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments